కీర్తనలు 103:19-22
కీర్తనలు 103:19-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు. యెహోవాదూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతిం చుడి.
కీర్తనలు 103:19-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి. యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి. యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
కీర్తనలు 103:19-22 పవిత్ర బైబిల్ (TERV)
దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు. దేవదూతలారా, యెహోవాను స్తుతించండి. దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు. మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి. యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి. మీరు ఆయన సేవకులు, దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు. అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు. అవన్నీ యెహోవాను స్తుతించాలి! నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
కీర్తనలు 103:19-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు, ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి. యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా, మీరంతా యెహోవాను స్తుతించండి. ప్రతిచోట ఆయన పరిపాలనలో ఉన్న సర్వ సృష్టి యెహోవాను స్తుతించండి.