కీర్తనలు 103:13-22
కీర్తనలు 103:13-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు, తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు; మనం ఎలా రూపించబడ్డామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు. మానవుల జీవితం గడ్డిలాంటిది, పొలంలో పువ్వు పూసినట్లు పూస్తారు; దాని మీద గాలి వీస్తే అది లేకుండా పోతుంది, దాని చోటుకు అది జ్ఞాపకం కూడా ఉండదు. ఆయనకు భయపడేవారి పట్ల యెహోవా మారని ప్రేమ వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది, ఆయన నిబంధనను పాటించేవారిపట్ల, ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది. యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు, ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి. యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా, మీరంతా యెహోవాను స్తుతించండి. ప్రతిచోట ఆయన పరిపాలనలో ఉన్న సర్వ సృష్టి యెహోవాను స్తుతించండి.
కీర్తనలు 103:13-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు. మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు. మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు. దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు. యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది. వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు. యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి. యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి. యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
కీర్తనలు 103:13-22 పవిత్ర బైబిల్ (TERV)
తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు. అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు. మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు. మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు. మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు. మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు. మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు. ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది. త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు. కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు. దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు. దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు. దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు. దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు. దేవదూతలారా, యెహోవాను స్తుతించండి. దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు. మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి. యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి. మీరు ఆయన సేవకులు, దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు. అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు. అవన్నీ యెహోవాను స్తుతించాలి! నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
కీర్తనలు 103:13-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు. నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు. యెహోవాదూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతిం చుడి.
కీర్తనలు 103:13-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)