కీర్తనలు 103:10-12
కీర్తనలు 103:10-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు. భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
కీర్తనలు 103:10-12 పవిత్ర బైబిల్ (TERV)
మనం దేవునికి విరోధంగా పాపం చేశాం. కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు. భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది. పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
కీర్తనలు 103:10-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచియున్నాడు.
కీర్తనలు 103:10-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మన పాపాలకు తగినట్లుగా ఆయన మనతో వ్యవహరించలేదు మన దోషాలకు ప్రతిగా మనకు తిరిగి చెల్లించలేదు. భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో, తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం. పడమటికి తూర్పు ఎంత దూరమో, అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు.