కీర్తనలు 102:12-17
కీర్తనలు 102:12-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు; మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది. మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు, ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది; నిర్ణీత సమయం వచ్చింది. దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి; దుమ్ము వారికి దయ కలిగించింది. జనులు యెహోవా నామానికి భయపడతారు, భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు. ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి తన మహిమతో ప్రత్యక్షమవుతారు. దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు; ఆయన వారి మనవులను త్రోసివేయరు.
కీర్తనలు 102:12-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నీ కీర్తి తరతరాలుంటుంది. నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది. దాని రాళ్లంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం. దాని శిథిలాల దుమ్ము అంటే వారికి వాత్సల్యం. యెహోవా, రాజ్యాలు నీ నామాన్ని గౌరవిస్తాయి, ప్రపంచ రాజులంతా నీ గొప్పదనాన్ని గౌరవిస్తారు. యెహోవా సీయోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆయన దిక్కులేని వాళ్ళ ప్రార్థనకు స్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయన నిరాకరించడు.
కీర్తనలు 102:12-17 పవిత్ర బైబిల్ (TERV)
అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది. నీవు లేచి సీయోనును ఆదరిస్తావు. నీవు సీయోను యెడల దయగా ఉండే సమయం వస్తూంది. యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు. జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు. దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు. ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు. యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు. దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు. దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.
కీర్తనలు 102:12-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును. నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను. దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములువారు దాని మంటిని కనికరించుదురు అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపకవారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
కీర్తనలు 102:12-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)