సామెతలు 9:10-12
సామెతలు 9:10-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
సామెతలు 9:10-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే. నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి. నువ్వు జ్ఞానం గలవాడివైతే నీ జ్ఞానం నీకే ఉపయోగపడుతుంది. నువ్వు అపహాసకుడివైతే దానివల్ల కలిగే ఫలితాలు నువ్వే భరించాలి.
సామెతలు 9:10-12 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా యెడల భయము కలిగి యుండుట జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు. నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. నీవు జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. కాని నీవు గర్వంగలవాడవై, యితరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి.
సామెతలు 9:10-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం, పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం. జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే ఎక్కువవుతాయి. నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము; జ్ఞానమును ఎగతాళి చేసిన ఎడల దానిని నీవే భరించవలెను.