సామెతలు 8:5-7
సామెతలు 8:5-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము
సామెతలు 8:5-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జ్ఞానం లేని మనుషులారా, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి అంటే ఎలాంటిదో ఆలోచించి గ్రహించండి. వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి. నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం.
సామెతలు 8:5-7 పవిత్ర బైబిల్ (TERV)
మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి. అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి. వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి. సరైన విషయాలు నేను మీకు చెబుతాను. నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు అసహ్యం.
సామెతలు 8:5-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అజ్ఞానులారా, వివేకాన్ని సంపాదించుకోండి, మూర్ఖులారా; వివేకంపై మనస్సు పెట్టండి. వినండి, నేను ఎంతో మంచి సంగతులను చెప్తున్నాను; నా పెదవులు న్యాయాన్ని మాత్రమే పలుకుతాయి. నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి.