సామెతలు 8:27-32
సామెతలు 8:27-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
సామెతలు 8:27-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవుడు ఆకాశ, విశాలములను సృష్టించి ఎంతో నీటి మీద మండలమును, సృష్టించినపుడు నేను పుట్టితిని. దేవుడు పైన మేఘాలను చేసినప్పుడు నీటి ధారలను ఆయన చేసినప్పుడు, నీరు తమ హద్దులు దాటి రాకుండా దేవుడు సముద్రానికి పొలిమేరను ఏర్పరచినప్పుడు, ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినపుడు. నేను దేవుని యొద్ద నైపుణ్యత కలిగిన పనివానిగా, ప్రతిరోజు సంతోషిస్తూ, ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను, దేవుడు కలుగజేసిన స్వర్గాన్ని బట్టి సంతోషిస్తూ మనుష్యులను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. “కాబట్టి పిల్లలారా, నా మాట వినండి; నా దారిని అనుసరించేవారు ధన్యులు.
సామెతలు 8:27-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన ఆకాశాలను స్థిరపరచి, జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆయన ఆకాశాన్ని స్థిరపరచినప్పుడు, జలధారలకు పరిథి ఉంచినప్పుడు నేను ఉన్నాను. భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను. నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ముఖ్యమైన శిల్పకారుణ్ణి నేనే. నిరంతరం ఆయన నన్ను గూర్చి ఆనందించాడు. ఆయన సన్నిధిలో నేను నిత్యమూ ఆనందిస్తున్నాను. ఆయన సృష్టించిన లోకాన్నిబట్టి, భూమిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. భూమిపై ఉన్న మానవ జాతిని చూసి ఆనందిస్తున్నాను. కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. నేను చెప్పే మార్గాలు అనుసరించే వాళ్ళు ధన్యులు.
సామెతలు 8:27-32 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఆకాశాలను చేసినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. ఆకాశంలో యెహోవా మేఘాలను ఉంచకముందే నేను పుట్టాను. మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను అక్కడ ఉన్నాను. సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను. యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు, భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు. అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు. “పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు
సామెతలు 8:27-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
సామెతలు 8:27-32 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)