సామెతలు 8:1-4
సామెతలు 8:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జ్ఞానం కేకలు పెడుతూ ఉంది. వివేకం పెద్దగా తన స్వరం వినిపిస్తూ ఉంది. రహదారుల్లో, ప్రధాన వీధుల్లో, పట్టణ దారులు కలిసే కూడలిలో అది నిలబడి ఉంది. నగర ప్రధాన ద్వారం దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర, పట్టణపు కేంద్రాల దగ్గర నిలబడి జ్ఞానం బిగ్గరగా ఇలా ప్రకటిస్తూ ఉంది. “మనుషులారా, ఈ మాటలు మీకోసమే. మనుషులైన మీకే నా మాటలు వినిపిస్తున్నాను.
సామెతలు 8:1-4 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది. మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి. పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి. తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి. జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
సామెతలు 8:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది – మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.
సామెతలు 8:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా? కొండ శిఖరాల మీదను, మార్గము ప్రక్కగా, దారులు కలిసే చోట ఆమె నిలువబడి ఉన్నది; పట్టణంలోకి వెళ్లే గుమ్మముల ప్రక్కన, ప్రవేశం దగ్గర, జ్ఞానం నిలువబడి, ఇలా కేకలు వేస్తుంది: మనుష్యులారా, మిమ్మల్నే నేను పిలుస్తున్నాను; మనుష్యులందరికి నా కంఠస్వరం వినిపిస్తున్నాను.