సామెతలు 7:2-4
సామెతలు 7:2-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము జ్ఞానముతో–నీవు నాకు అక్కవనియు తెలివితో–నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
సామెతలు 7:2-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు; నా బోధనలను నీ కనుపాపలా కాపాడు. నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో; నీ హృదయ పలక మీద వ్రాసుకో. జ్ఞానంతో, “నీవు నా సోదరివి” అంతరార్థంతో, “నీవు నాకు బంధువువనియు చెప్పు.”
సామెతలు 7:2-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుని నీ కంటిపాపలాగా నా ఉపదేశాన్ని కాపాడుకుంటే నీకు జీవం కలుగుతుంది. నీ చేతి వేళ్లకు వాటిని కట్టుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసి ఉంచుకో. జ్ఞానంతో “నీవు నా సోదరివి” అని చెప్పు. వివేకాన్ని నీ బంధువుగా భావించు.
సామెతలు 7:2-4 పవిత్ర బైబిల్ (TERV)
నా ఆజ్ఞలకు విధేయుడవు కమ్ము, నీకు జీవం కలుగుతుంది. నా ఉపదేశాన్ని కనుపాపలాగ ఎంచుకో. (నీ జీవింతలోకెల్లా అతి ముఖ్యమైనది). నా ఆజ్ఞలను ఉపదేశాలను ఎల్లప్పుడూ నీతో ఉంచుకో. వాటిని నీ వ్రేళ్లకు కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. జ్ఞానాన్ని నీ సోదరిగా ఎంచు. తెలివిని నీ కుటుంబంలో ఒక భాగంగా చూసుకో.