సామెతలు 4:20-24
సామెతలు 4:20-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు, నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో. వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి. నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో; మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.
సామెతలు 4:20-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో. నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో. అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.
సామెతలు 4:20-24 పవిత్ర బైబిల్ (TERV)
నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. నా మాటలు నిన్ను విడిచి పోనియ్యకు. నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో. నా ఉపదేశము వినేవారికి అది జీవం కలిగిస్తుంది నా మాటలు శరీరానికి మంచి ఆరోగ్యంలాంటివి. నీవు తలంచే విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండటమే నీకు అతి ముఖ్యమైన విషయం. నీ తలంపులు నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకుంటాయి. సత్యమును వక్రం చేయవద్దు, సరికాని మాటలు చేప్పవద్దు. అబద్ధాలు చెప్పకు.
సామెతలు 4:20-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమునువారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.
సామెతలు 4:20-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)