సామెతలు 4:11-13
సామెతలు 4:11-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను. నీవు నడుస్తున్నప్పుడు, నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తినప్పుడు, నీ పాదాలు తడబడవు. ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో.
సామెతలు 4:11-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు. అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో.
సామెతలు 4:11-13 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్పిస్తున్నాను. నేను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను. ఈ మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా ఉంటావు. ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు జీవం!
సామెతలు 4:11-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
సామెతలు 4:11-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)