సామెతలు 30:32-33 - Compare All Versions
సామెతలు 30:32-33 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల కీడు ఆలోచించిన యెడల నీ చేతితో నోరు మూసుకో. పాలు తరచగా వెన్న వస్తుంది ముక్కు పిండగా రక్తం వస్తుంది కోపం రేపగా తగవు పుడుతుంది.”
సామెతలు 30:32-33 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో. పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.
సామెతలు 30:32-33 TERV (పవిత్ర బైబిల్)
నీవు తెలివితక్కువవాడవై యుండి ఇతరులకంటె నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తల డితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్నదాన్ని గూర్చి ఆలోచించాలి. ఒక మనిషి పాలను చిలికితే వెన్న వస్తుంది. ఒకడు మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు.
సామెతలు 30:32-33 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు బుద్ధిహీనుడవై అతిశయపడియుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును.