సామెతలు 21:13-15
సామెతలు 21:13-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.
సామెతలు 21:13-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు, తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు. చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది, ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది. న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం కాని చెడు చేసేవారికి అది భయంకరము.
సామెతలు 21:13-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు. చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది. న్యాయ క్రియలు చేయడం నీతిపరుడికి సంతోషం. పాపాత్ముడికి అది భయంకరం.
సామెతలు 21:13-15 పవిత్ర బైబిల్ (TERV)
పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఒక వ్యక్తి తృణీకరిస్తే తర్వాత అతనికి అవసరమైనప్పుడు ఏ సహాయమూ దొరకదు. ఒక వ్యక్తికి నీ మీద కోపం ఉంటే అతనికి రహస్యంగా ఒక కానుక ఇవ్వు. రహస్యంగా ఇచ్చిన కానుక గొప్ప కోపాన్ని వారించగలదు. న్యాయమైన తీర్పు మంచి మనుష్యులను సంతోషింపజేస్తుంది. కాని దుర్మార్గులను అది భయపెడుతుంది.
సామెతలు 21:13-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.
సామెతలు 21:13-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)