సామెతలు 17:5-14
సామెతలు 17:5-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యమువలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదముచేయును. బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.
సామెతలు 17:5-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు. పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము. అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు, అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం! లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు. ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు, జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు. బుద్ధిహీనునికి పడే వంద దెబ్బల కంటే, వివేకంగల వానికి ఒక గద్దింపు ప్రభావం చూపుతుంది. ఎదిరించువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట దయలేని దూత పంపబడును. మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు. మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు. గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది; కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి.
సామెతలు 17:5-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు. మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే. అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు. లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది. ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు. బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది. దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు. మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం. మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు. పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి.
సామెతలు 17:5-14 పవిత్ర బైబిల్ (TERV)
కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమస్యలు ఉన్నవాళ్లను చూచి వారు ఎగతాళి చేస్తారు. వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది సూచిస్తుంది. ఈ దుర్మార్గులు శిక్షించబడుతారు. మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోషపెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి అతిశయిస్తారు. ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడటం జ్ఞానముగల పనికాదు. అదే విధంగా ఒక అధికారి అబద్ధాలు చెప్పటం జ్ఞానముగల పనికాదు. లంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అనుకొంటారు. నీ విషయంలో తప్పు చేసినవాణ్ణి నీవు క్షమిస్తే, మీరు స్నేహితులుగా ఉంటారు. కాని అతడు చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసికొంటూనే ఉంటే, అది మీ స్నేహానికి హాని చేస్తుంది. తెలివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా నేర్చుకొంటాడు. కాని బుద్ధిహీనుడు నూరు పాఠాల తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు. దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతణ్ణి శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తుకొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవటం చాలా ప్రమాదకరం. కాని తెలివి తక్కువ పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుణ్ణి కలుసుకోవటంకంటే అది మేలు. నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి. నీవు వాదం మొదలుపెడ్తే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి.
సామెతలు 17:5-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యమువలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదముచేయును. బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.
సామెతలు 17:5-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)