సామెతలు 17:25-28
సామెతలు 17:25-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బుద్ధిలేని పిల్లలు తమ తండ్రికి దుఃఖం తెస్తారు, తమను కనిన తల్లికి అట్టివారు శోకం కలిగిస్తారు. అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే, నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు. తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంత గుణముగలవాడు మంచిచెడులు ఎరిగినవాడు. ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును, తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.
సామెతలు 17:25-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బుద్ధిలేని కొడుకు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. కన్న తల్లికి వాడు వేదన కలిగిస్తాడు. మంచి చేసే వారిని శిక్షించడం న్యాయం కాదు. యథార్థత గల ఉదాత్తులను కొరడాలతో కొట్టడం తగదు. జ్ఞానం గలవాడు తక్కువగా మాట్లాడతాడు. అవగాహన గలవాడు శాంత గుణం కలిగి ఉంటాడు. మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.
సామెతలు 17:25-28 పవిత్ర బైబిల్ (TERV)
తెలివి తక్కువ కుమారుడు తన తండ్రికి దు: ఖం కలిగిస్తాడు. మరియు తెలివి తక్కువ కుమారుడు తనకు జన్మ నిచ్చిన తల్లికి విచారం కలిగిస్తాడు. ఏ తప్పు చేయని వానిని శిక్షించటం తప్పు. నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడు వారిని శిక్షించటం తప్పు. జ్ఞానముగలవాడు మాటల్ని జాగ్రత్తగా ప్రయోగిస్తాడు. జ్ఞానముగలవాడు త్వరగా కోపగించుకోడు. బుద్ధిహీనుడు కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు జ్ఞానిలా కనిపిస్తాడు. అతడు ఏమీ చెప్పకపోతే జ్ఞానము గలవాడు అని ప్రజలు అనుకొంటారు.
సామెతలు 17:25-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.
సామెతలు 17:25-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)