నెహెమ్యా 2:16-18

నెహెమ్యా 2:16-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అయితే నేను ఎక్కడికి వెళ్ళానో ఏమి చేసానో అధికారులకు తెలియలేదు. యూదులకు గానీ యాజకులకు గానీ రాజ వంశీకులకు గానీ అధికారులకు గానీ పని చేసే ఇతరులకు గానీ నేను ఆ సంగతి ఇంకా చెప్పలేదు. వారితో నేను “మనం ఎంత కష్టంలో ఉన్నామో మీకు తెలుసు. యెరూషలేము పాడుబడి పోయింది. కోట తలుపులు తగలబడి పోయాయి. ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. రండి, యెరూషలేము ప్రాకారం తిరిగి కడదాం, ఇకపై మనం నింద పాలు కాకూడదు” అన్నాను. దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉన్న సంగతి, రాజు నాకు అభయమిచ్చిన మాటల గురించీ నేను వారితో చెప్పాను. అందుకు వారు “మనం లేచి కట్టడం మొదలు పెడదాం” అన్నారు. వారు ఈ మంచి పనికి సిద్ధపడ్డారు.

షేర్ చేయి
Read నెహెమ్యా 2

నెహెమ్యా 2:16-18 పవిత్ర బైబిల్ (TERV)

అధికారులకు, ఇశ్రాయేలులోని ప్రముఖులకు నేనెక్కడికి వెళ్లానో తెలియదు. నేనేమి చేస్తున్నానో తెలియదు. యూదులకు, యాజకులకు, రాజ కుటుంబీకులకు, ఉద్యోగులకు, లేక పని చేయబోయే ఏ యితరులకు నేను అప్పటికింకా ఏమీ చెప్పలేదు. తర్వాత నేను వాళ్లందరికీ యిలా చెప్పాను: “మనకు ఇక్కడున్న ఇబ్బందేమిటో మీరు చూడగలరనుకుంటున్నాను. యెరూషలేము శిథిలాల గుట్టలావుంది. దాని ద్వారాలు మంటలకి కాలిపొయాయి. రండి, యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టెదము. అప్పుడిక మనం ఎప్పటికీ సిగ్గుపడము.” అప్పుడు నేను వాళ్లకి దేవుడు నాపట్ల ఎలాదయ చూపాడో చెప్పాను. రాగారు నాతో అన్న మాటలుచె ప్పాను. అప్పుడు వాళ్లు, “ఇప్పుడే పని ప్రారంభిద్దాం పదండి!” అన్నారు. దానితో మేము ఈ మంచి పని ప్రారంభించాము.

షేర్ చేయి
Read నెహెమ్యా 2

నెహెమ్యా 2:16-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకేగాని యాజకులకేగాని యజమానులకేగాని అధికారులకేగాని పనిచేయు ఇతరమైనవారికేగాని నేను ఆ సంగతి చెప్పి యుండలేదు. అయితే వారితో నేనిట్లంటిని–మనకు కలిగినశ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చ బడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయముచేయు దేవుని కరుణాహస్తమునుగూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు–మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.

షేర్ చేయి
Read నెహెమ్యా 2

నెహెమ్యా 2:16-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నేను ఎక్కడ వెళ్లానో ఏమి చేస్తున్నానో అధికారులకు తెలియదు. యూదులకు గాని యాజకులకు గాని సంస్థానాధిపతులకు గాని ఇతర అధికారులకు గాని నేను ఆ విషయం చెప్పలేదు. నేను వారితో, “మనకున్న సమస్యను మీరు చూశారు. యెరూషలేము పాడైపోయింది దాని గుమ్మాలు కాలిపోయాయి. రండి, ఇకపై ఈ నింద మనమీద ఉండకుండా యెరూషలేమును తిరిగి కడదాం” అన్నాను. అంతే కాకుండా దేవుని కృపాహస్తమే నాకు తోడుగా ఉండడం గురించి రాజు నాతో చెప్పినవన్నీ వారితో చెప్పాను. అందుకు వారు, “మనం పునర్నిర్మాణం మొదలుపెడదాం” అని చెప్పి ఈ మంచి పనిని ప్రారంభించారు.

షేర్ చేయి
Read నెహెమ్యా 2