మార్కు 13:24-27
మార్కు 13:24-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“కాని ఆ దినాలలో, ఆ శ్రమకాలం తర్వాత, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి కదల్చబడతాయి.’ “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో మరియు మహిమతో మేఘాలలో రావడం ప్రజలు చూస్తారు. ఆయన తన దూతలను పంపి, నలుదిక్కుల నుండి, భూమి చివర్ల నుండి ఆకాశాల చివర్ల వరకు ఆయన ఎన్నుకొన్న వారిని పోగుచేస్తారు.
మార్కు 13:24-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు. ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి. అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.”
మార్కు 13:24-27 పవిత్ర బైబిల్ (TERV)
“కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో, ‘సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు తన వెలుగును వెదజల్లడు. ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’ “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, తేజస్సుతో, మేఘాలమీద రావటం మానవులు చూస్తారు. ఆయన నలువైపుల నుండి, అంటే ఈ మూలనుండి ఆ మూల దాకా, తన దేవదూతలను పంపి తానెన్నుకున్న ప్రజలను ప్రోగు చేయిస్తాడు.
మార్కు 13:24-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును.