మీకా 4:6-8

మీకా 4:6-8 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా చెపుతున్నాడు, “యెరూషలేము గాయపర్చబడగా కుంటిది అయ్యింది. యెరూషలేము అవతలకు విసిరివేయబడింది. యెరూషలేము గాయపర్చబడింది; శిక్షింపబడింది. అయినా నేను ఆమెను నా వద్దకు తీసుకొనివస్తాను. “ఆ ‘కుంటి’ నగరవాసులే బతుకుతారు. ఆ నగర ప్రజలు నగరం వదిలివెళ్లేలా బలవంత పెట్టబడ్డారు. కాని నేను వారిని ఒక బలమైన రాజ్యంగా రూపొందిస్తాను.” యెహోవా వారికి రాజుగా ఉంటాడు. ఆయన శాశ్వతంగా సీయోను పర్వతం మీదనుండి పరిపాలిస్తాడు. ఓ మందల కావలిదుర్గమా, ఓ సీయోను కుమార్తె పర్వతమైన ఓఫెలూ, గతంలోమాదిరి నీవొక రాజ్యంగా రూపొందుతావు. అవును, సీయోను కుమారీ, ఆ రాజ్యం నీకు వస్తుంది.

షేర్ చేయి
చదువండి మీకా 4