మత్తయి 6:20-22
మత్తయి 6:20-22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే మీ కొరకు పరలోకంలో ధనం కూడపెట్టుకోండి, అక్కడ చిమ్మెట గాని క్రిమికీటకాలుగాని నాశనం చేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు. ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది. “కన్ను దేహానికి దీపం. నీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటే నీ దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది.
మత్తయి 6:20-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది. “శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది.
మత్తయి 6:20-22 పవిత్ర బైబిల్ (TERV)
మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది.
మత్తయి 6:20-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.