మత్తయి 6:11-13
మత్తయి 6:11-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:11-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి. మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు. మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:11-13 పవిత్ర బైబిల్ (TERV)
ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము. ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి, మేము చేసిన పాపాలను కూడా క్షమించుము. మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు. పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:11-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
షేర్ చేయి
చదువండి మత్తయి 6