మత్తయి 6:1-4

మత్తయి 6:1-4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

“మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండా జాగ్రత్తపడండి. మీరు అలా చేస్తే, పరలోకంలోని మీ తండ్రి దగ్గర నుండి ఫలాన్ని పొందుకోరు. “కాబట్టి మీరు అవసరంలో ఉన్నవారికి ఇచ్చేటప్పుడు, ఇతరుల నుండి గౌరవించబడాలని, సమాజమందిరాల్లో, వీధుల్లో ప్రకటించుకొనే వేషధారుల్లా బూరలు ఊది ప్రకటించుకోకండి. అలాంటివారు తమ పూర్తి ప్రతిఫలం పొందుకున్నారని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేటప్పుడు, కుడి చెయ్యి చేసేది మీ ఎడమ చేతికి తెలియకూడదు. మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. అప్పుడు రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.

షేర్ చేయి
Read మత్తయి 6

మత్తయి 6:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను. నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

షేర్ చేయి
Read మత్తయి 6