మత్తయి 2:9-10
మత్తయి 2:9-10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు రాజు మాటలు విని, బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి నిలిచే వరకు వారి ముందు వెళ్తూ వుండింది. వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు చాలా ఆనందించారు.
మత్తయి 2:9-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది. ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు.
మత్తయి 2:9-10 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.
మత్తయి 2:9-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమునవారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.