మత్తయి 1:24-25
మత్తయి 1:24-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యోసేపు నిద్రలేచి ప్రభువు దూత తనకు ఆదేశించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంట్లో చేర్చుకున్నాడు. అయితే ఆమె కుమారునికి జన్మనిచ్చే వరకు, యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు.
మత్తయి 1:24-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు. అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.
మత్తయి 1:24-25 పవిత్ర బైబిల్ (TERV)
యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.
మత్తయి 1:24-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
మత్తయి 1:24-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)