మత్తయి 1:21-23
మత్తయి 1:21-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
మత్తయి 1:21-23 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది, ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తారు కనుక నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి” అని చెప్పాడు. ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది, “ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారునికి జన్మనిస్తుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు” ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.
మత్తయి 1:21-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు. “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.
మత్తయి 1:21-23 పవిత్ర బైబిల్ (TERV)
ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు. ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు” ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.