లూకా 23:50-51
లూకా 23:50-51 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునైయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు.
లూకా 23:50-51 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు నీతిపరుడు. అతడు ఇతర న్యాయసభ సభ్యుల తీర్మానానికి గాని వారి చర్యకు గాని అంగీకరించకుండా దేవుని రాజ్యం కోసం కనిపెడుతూ ఉండినవాడు.
లూకా 23:50-51 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు. మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
లూకా 23:50-51 పవిత్ర బైబిల్ (TERV)
అరిమతయియ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు. నీతిమంతుడు, మంచివాడు. యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మహాసభ సభ్యులు యేసుకు మరణ శిక్ష విధించటానికి నిర్ణయించినప్పుడు అతడు ఒప్పుకోలేదు.