లేవీయకాండము 18:28-30
లేవీయకాండము 18:28-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు దేశాన్ని అపవిత్రం చేస్తే, అది ముందున్న జనాలను బయటికి వెళ్లగ్రక్కినట్లు మిమ్మల్ని కూడ వెళ్లగ్రక్కుతుంది. “ ‘ఎవరైనా ఇలాంటి హేయమైన కార్యాలు చేస్తే వారు ప్రజల్లో నుండి తొలగించబడతారు. నేను మీకు చెప్పినవి పాటించి, అక్కడ మీకన్నా ముందు నివసించినవారు పాటించిన హేయమైన ఆచారాల్లో దేనినైనా పాటించి వాటివలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
లేవీయకాండము 18:28-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా చట్టాలను, నా విధులను ఆచరించాలి. అలాటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు. కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.”
లేవీయకాండము 18:28-30 పవిత్ర బైబిల్ (TERV)
మీరూ ఈ పనులు చేస్తే, మీరూ ఆ దేశాన్ని మైల చేస్తారు. మరియు మీకంటె ముందు అక్కడ ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టినట్లు అది మిమ్మల్ని కూడ వెళ్ళగొడుతుంది. ఏ వ్యక్తి గాని ఈ దారుణ పాపాలలో దేనినైనా జరిగిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. ఇతరులు ఆ భయంకర పాపాలు చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. ఆ భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసుకోవద్దు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
లేవీయకాండము 18:26-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతనుబట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలోనుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
లేవీయకాండము 18:28-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)