విలాపవాక్యములు 3:20-22
విలాపవాక్యములు 3:20-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను. కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది. యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
విలాపవాక్యములు 3:20-22 పవిత్ర బైబిల్ (TERV)
నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను. కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది. నేను ఇలా అనుకున్నాను. యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
విలాపవాక్యములు 3:20-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
విలాపవాక్యములు 3:20-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది. అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి నాకు నిరీక్షణ ఉంది: యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.