యెహోషువ 12:1-6

యెహోషువ 12:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోనుకొండవరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువరకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానమువరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయులయొక్కయు మాయకాతీయులయొక్కయు సరిహద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దువరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.

యెహోషువ 12:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇశ్రాయేలీయులు ఓడించిన దేశపు రాజులు వీరే: అర్నోను కొండగట్టు నుండి హెర్మోను పర్వతం వరకు, అరాబాకు తూర్పున ఉన్న ప్రాంతంతో సహా యొర్దానుకు తూర్పున ఉన్న వారి దేశాలను స్వాధీనం చేసుకున్నారు. అమోరీయుల రాజైన సీహోను హెష్బోను నుండి పరిపాలించాడు. అతడు అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి అనగా కొండ మధ్య నుండి అమ్మోనీయుల సరిహద్దు యైన యబ్బోకు నది వరకు పరిపాలించాడు. ఇందులో సగం గిలాదు ఉంది. అతడు తూర్పు అరాబాను కిన్నెరెతు సముద్రం నుండి అరాబా సముద్రం (అంటే మృత సముద్రం) వరకు, బేత్-యెషిమోతు వరకు, ఆపై పిస్గా కొండ క్రింద దక్షిణం వైపు వరకు పరిపాలించాడు. అష్తారోతు, ఎద్రెయీలలో పాలించిన రెఫాయీయులలో చివరివాడైన బాషాను రాజైన ఓగు యొక్క భూభాగము. అతడు హెర్మోను పర్వతం, సలేకా, గెషూరు, మయకా ప్రజల సరిహద్దు వరకు బాషాను మొత్తాన్ని, గిలాదులో సగం హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు పరిపాలించాడు. యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలీయులు వారిని జయించారు. యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి వారి భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు.

యెహోషువ 12:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకొన్న రాజులు ఎవరంటే, అమోరీయుల రాజు సీహోను. అతడు హెష్బోనులో నివసిస్తూ అర్నోను నదీ తీరంలోని అరోయేరు నుండి, అంటే ఆ నదీ లోయ మధ్య నుండి గిలాదు అర్థభాగమూ అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న యబ్బోకు నది లోయ వరకూ తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకూ తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గంలో ఉప్పు సముద్రంగా నున్న అరాబా సముద్రం వరకూ దక్షిణం వైపున పిస్గాకొండ చరియల కింద ఉన్న మైదానం వరకూ పరిపాలించాడు. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగును పట్టుకున్నారు. అతడు రెఫాయీయుల్లో మిగిలిన వారిలో ఒకడు. అతడు అష్తారోతులో ఎద్రెయిలో నివసించి గెషూరీయుల, మాయకాతీయుల సరిహద్దు వరకూ బాషాను అంతటా సల్కా, హెర్మోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకూ గిలాదు అర్థభాగంలో పాలించినవాడు. యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులూ వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే, ఆ భూమిని రూబేనీయులకూ గాదీయులకూ మనష్షే అర్థగోత్రపు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు.

యెహోషువ 12:1-6 పవిత్ర బైబిల్ (TERV)

యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అర్నోను లోయనుండి హెర్మోను కొండవరకు, అరాబాకు తూర్పు ప్రాంతాన గల భూమి అంతా ఇప్పుడు వారిదే. ఈ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది: హెష్బోను పట్టణంలో నివసిస్తున్న అమోరీ ప్రజల రాజు సీహోను, అర్నోను లోయవద్ద అరోయేరు నుండి యబ్బోకు నదివరకుగల దేశం అంతా అతడు పాలించాడు. ఆ లోయ మధ్యనుండి అతడి దేశంమొదలవుతుంది. అమ్మోనీ ప్రజలకు, వారికి ఇది సరిహద్దు. గిలాదులోని సగం భూమిని సీహోను పాలించాడు. అరాబా తూర్పు ప్రాంతంలో కిన్నెరెతు సముద్రంనుండి అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) వరకు అతడు పాలించాడు. బెత్ ఎషిమోతు నుండి దక్షిణాన పిస్గా కొండల వరకు అతడు పాలించాడు. బాషాను రాజు ఓగు రెఫాయిము సంతతివాడు. అష్టారోతు, ఎద్రేయిలో ఓగు దేశాన్ని పాలించాడు. హెర్మోను కొండ, సలెకా, బాషాను ప్రాంతం అంతా ఓగు పాలించాడు. గెషూరు, మాక ప్రజలు నివసించిన చోట అతని దేశం సరిహద్దు. గిలాదులో సగం భూభాగాన్ని కూడ ఓగు పాలించాడు. హెష్బోను రాజు సీహోను భూమికి ఈ భూమి సరిహద్దు. యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఈ రాజులందరినీ ఓడించారు. మరియు ఆ భూమిని రూబేను వంశం, గాదు వంశం మనష్షే వంశంలో సగం భాగానికి మోషే ఇచ్చాడు. ఈ భూమిని వారికి స్వంతంగా ఇచ్చేసాడు మోషే.

యెహోషువ 12:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోనుకొండవరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువరకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానమువరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయులయొక్కయు మాయకాతీయులయొక్కయు సరిహద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దువరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.

యెహోషువ 12:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)