యోబు 8:12-15
యోబు 8:12-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దాన్ని కోయకముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది. అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది.
యోబు 8:12-15 పవిత్ర బైబిల్ (TERV)
లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి. వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి. దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు. దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు. ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది. ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది. ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా ఆ గూడు తెగిపోతుంది. అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.
యోబు 8:12-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును. దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే. అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు. అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును.
యోబు 8:12-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అవి కోయకముందు పచ్చగా ఉంటాయి గడ్డి కంటే త్వరగా వాడిపోతాయి. దేవుడిని మరచిపోయే వారందరి గతి ఇలాగే ఉంటుంది; భక్తిహీనుల ఆశ అడుగంటిపోతుంది. వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది. వారి ఆశ్రయం సాలెగూడు వంటిది. వారు సాలెగూడును ఆశ్రయిస్తారు కాని అది నిలబడదు, వారు దానిని అంటిపెట్టుకుంటారు కాని అది విడిపోతుంది.