యోబు 6:1-30

యోబు 6:1-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను– నా దుఃఖము చక్కగా తూచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా? ఎద్దు మేత చూచి రంకెవేయునా? ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డు లోని తెలుపులో రుచికలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొన కుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల? నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా. క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడనివారైరి. మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమై పోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియు లేకుండ అవి యింకిపోవును. సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. –ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా? పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా? నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా. మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు, మీ స్నేహితులమీద బేరము సాగింతురు. దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయములేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?

షేర్ చేయి
చదువండి యోబు 6

యోబు 6:1-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: “కేవలం నా వేదనను తూకం వేసి, నా కష్టాలన్నీ త్రాసులో ఉంచి లెక్కిస్తే, సముద్రాల ఇసుక కంటే అవి బరువుగా ఉంటాయి, కాబట్టి నా మాటలు ఉద్వేగభరితంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. సర్వశక్తిమంతుడైన దేవుని బాణాలు నాకు గుచ్చుకున్నాయి, నా ఆత్మ వాటికున్న విషం త్రాగింది; దేవుని భయంకరకార్యాలు నాకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నాయి. గడ్డి దొరికితే అడవి గాడిద అరుస్తుందా, మేత దొరికితే ఎద్దు రంకెవేస్తుందా? ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా? నేను దాన్ని తాకను, అలాంటి ఆహారం తింటే నా ఆరోగ్యం పాడవుతుంది. “నా అభ్యర్థన నెరవేరి, దేవుడే నా కోరికను అనుగ్రహించియుంటే బాగుండేది, దేవుడు ఇష్టపూర్వకంగా నన్ను నలిపివేసి, తన చేయి జాడించి నా ప్రాణాన్ని తీసివేస్తే బాగుండేది! అప్పుడు నేను ఈ ఆదరణ కలిగి ఉంటాను, భరించలేని బాధలో ఉన్నప్పటికీ, పరిశుద్ధుని మాటలు నేను తిరస్కరించలేదని ఆనందిస్తాను. “నేను ఇంకా నిరీక్షణ కలిగి ఉండడానికి నాకున్న బలమెంత? నేను ఓపికగా ఉండడానికి నా అంతం ఏపాటిది? రాయికున్నంత బలం నాకుందా? నాదేమైనా ఇత్తడి శరీరమా? నాకు నేను సహాయం చేసుకోగల శక్తి నాలో ఏమైన ఉన్నదా? నా శక్తి నన్ను పూర్తిగా విడిచిపెట్టింది. “స్నేహితునికి దయ చూపనివాడు సర్వశక్తిమంతుడైన దేవుని భయం విడిచిపెట్టినవాడు. కాని నా సహోదరులు నమ్మదగని జలప్రవాహాల్లా ఉన్నారు, ఉప్పొంగే వాగుల్లా ఆధారపడదగనివారుగా ఉన్నారు, అవి కరిగిపోతున్న మంచుగడ్డలతో, వాటి మీద కురిసిన మంచుతో అవి నల్లబారాయి. కాని వేసవికాలంలో వాటి ప్రవాహం ఆగిపోతుంది, వేడికి వాటి స్థలాల్లోనే అవి ఆవిరైపోతాయి. అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి. తేమా వర్తకుల గుంపు నీటి కోసం వెదకుతారు, షేబ వ్యాపారులు వాటికోసం ఆశతో చూస్తారు. వారు నమ్మకంగా ఉన్నందుకు వారు దుఃఖపడుతున్నారు, అక్కడికి వచ్చి వారు నిరాశ చెందారు. ఇప్పుడు మీరు కూడా ఏ సహాయం ఇవ్వలేరని నిరూపించారు; మీరు ఆపదను చూసి భయపడుతున్నారు. నేను ఎప్పుడైనా, ‘నాకేమైనా ఇవ్వండి అని అడిగానా? మీ ఆస్తిలో నుండి నాకేమైనా బహుమానం తెమ్మని అడిగానా? శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించమని, క్రూరుల బారి నుండి నన్ను తప్పించండి’ అని అడిగానా? “నాకు బోధించండి, నేను మౌనంగా ఉంటాను; నా తప్పేంటో నేను గ్రహించేలా నాకు చూపించండి. యథార్థమైన మాటలు ఎంతో బాధాకరమైనవి, కాని మీ వాదనలు ఏమి నిరూపిస్తున్నాయి? నేను చెప్పే మాటలను సరిచేయాలని చూస్తున్నారా, నిరాశతో కూడిన నా మాటలు గాలివంటివే అని అనుకుంటున్నారా? మీరు తండ్రిలేనివారిని కొనడానికి చీట్లు వేస్తారు, మీ స్నేహితుని మీద బేరమాడతారు. “అయితే ఇప్పుడు నన్ను దయతో చూడండి, మీ ముఖాలు చూస్తూ అబద్ధం చెప్పగలనా? పశ్చాత్తాపపడండి, అన్యాయం చేయకండి; మరలా విచారించండి ఎందుకంటే నాలో ఇంకా యథార్థత ఉంది. నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా?

షేర్ చేయి
చదువండి యోబు 6

యోబు 6:1-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు. ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగా తూస్తారు గాక. నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారు గాక. అలా చేసినప్పుడు నా దుఃఖం సముద్రంలో ఉన్న ఇసక కన్నా బరువుగా ఉంటుంది. అందుకనే నేను వ్యర్ధమైన మాటలు పలికాను. సర్వశక్తిమంతుడైన దేవుడు వేసిన బాణాలు నాలో దిగాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. నాతో యుద్ధం చేయడానికి దేవుని భయంకరమైన చర్యలు వరసగా నిలిచి ఉన్నాయి. అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలు వేస్తుందా? ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్ల సొనకు రుచి ఉంటుందా? అలాంటి వాటిని తీసుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాటినే నేను తినవలసి వస్తుంది. నా విన్నపాలు తీరితే ఎంత బాగుంటుంది! నేను కోరినదంతా దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగుంటుంది! దేవుడు తన ఇష్టప్రకారం నన్ను నలగ్గొడతాడు గాక. తన చెయ్యి ఎత్తి నన్ను కడతేరుస్తాడు గాక. ఇదే నాకు ఓదార్పు అవుతుంది. మానని నొప్పిని బట్టి నేను అతిశయపడతాను. అప్పుడు కనీసం పరిశుద్ధ దేవుని మాటలను తోసిపుచ్చలేదన్న ఆదరణన్నా నాకు మిగులుతుంది. నాకున్న బలం ఎంత? నేను దేని కోసం ఎదురు చూడాలి? నా అంతిమ స్థితి ఏమిటి? ఇదంతా నేను ఎందుకు ఓర్చుకోవాలి? నాకు రాళ్లకు ఉన్నంత గట్టితనం ఉందా? నా శరీరం ఇత్తడిదా? నాలో నుంచి నాకు సహాయం ఏమీ దొరకదు గదా. నాలో నుండి నా శక్తి అంతా సన్నగిల్లిపోయింది గదా. కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు. నా స్నేహితులు ఎండిపోయిన చిన్న కాలవలాగా, కనబడకుండా మాయమైపోయే ప్రవాహంలాగా నమ్మకూడని వారుగా మారారు. అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, కురిసిన మంచుతో మురికిగా కనబడతాయి. వేసవికాలంలో అవి మాయమైపోతాయి. వేడి తగిలినప్పుడు అవి ఉన్నచోట్ల నుండి ఆవిరైపోతాయి. వాటి నుండి ప్రవహించే నీళ్ళు దారి మళ్ళుతాయి. ఏమీ కనబడకుండా అవి ఇంకిపోతాయి. తేమా నుండి గుంపులుగా బయలు దేరి వచ్చే వ్యాపారులు వాటి కోసం వెతుకుతారు. షేబ వర్తకులు వాటి కోసం ఆశిస్తారు. వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు. వాటిని సమీపించి కలవరానికి గురౌతారు. మీరు ఆ ప్రవాహం వలే ఉండీ లేనట్టుగా ఉన్నారు. నా దీన స్థితిని చూసి మీరు భయపడుతున్నారు. నాకు ఏమైనా సహాయం చేయమని మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం భాగం ఏమైనా ఇమ్మని అడిగానా? శత్రువు చేతిలోనుండి నన్ను విడిపించమని అడిగానా? నన్ను బాధ పెడుతున్నవాళ్ళ బారి నుండి కాపాడమని అడిగానా? నాకు మంచి మాటలు చెప్పండి. నేను మౌనంగా మీరు చెప్పేది వింటాను. ఏ ఏ విషయాల్లో నేను తప్పిపోయానో నాకు తెలియపరచండి. యథార్థమైన మాటలు ఎంతో ప్రభావం చూపుతాయి. అయినా మీ గద్దింపుల వల్ల ప్రయోజనం ఏమిటి? నా మాటలను ఖండించాలని మీరు అనుకుంటున్నారా? నిరాశాపూరితమైన నా మాటలు గాలిలో కొట్టుకుపోతాయి గదా. మీరు తండ్రిలేని అనాథలను కొనేందుకు చీట్లు వేసే మనుషుల వంటివారు. మీ స్నేహితుల మీద బేరాలు సాగించే గుణం మీది. దయచేసి నన్ను చూడండి. మీ సమక్షంలో నేను అబద్ధాలు చెబుతానా? ఆలోచించండి. మీరు చెప్పే తీర్పులో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి, ఈ విషయాల్లో నేను నిర్దోషిని. నేను అన్యాయపు మాటలు పలుకుతానా? దుర్మార్గమైన మాటలు పలకకుండా నా నోరు అదుపులో ఉండదా?

షేర్ చేయి
చదువండి యోబు 6

యోబు 6:1-30 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: “నా శ్రమే గనుక తూచబడితే, నా కష్టం అంతా త్రాసులో ఉంచబడితే, సముద్రాల ఇసుక కంటె నా దుఃఖం ఎక్కువ బరువయిందని నీవు గ్రహిస్తావు! అందుకే నా మాటలు వెర్రిగా కనిపిస్తాయి. సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి. ఈ బాణాల విషం నా ఆత్మను తాకుతుంది. దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపి నాకు విరోధంగా ఉంచబడ్డాయి. (ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చెయ్యదు. ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చెయ్యదు. రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా? గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది. (ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకోవటానికి కూడా ఒప్పుకోను; అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది. “నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను. నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను. దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి, నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను! ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను. ఎడతెగని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్ధుని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు. “నా బలం క్షీణించిపోయింది, గనుక నేను ఇంకా బ్రతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు. చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు. బండలాంటి బలం నాకు లేదు. నా శరీరం కంచుతో చేయబడలేదు. ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తినాకు లేదు. ఎందుకంటే విజయం నా వద్దనుండి తొలగించి వేయబడింది. “ఒక మనిషి కష్టాల్లో ఉంటే, అతని స్నేహితులు అతని మీద దయ చూపాలి. ఒక మనిషి, తన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన దేవుని నుండి దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి నమ్మకంగా ఉండాలి. కానీ, నా సోదరులారా, మీరు నమ్మకస్థులు కారు. నేను మీ మీద ఆధారపడలేదు. ఒక్కొక్కప్పుడు ప్రవహించి, ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలువల్లా ఉన్నారు మీరు. మంచు గడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకొన్నప్పుడు పొంగి ప్రవహించే కాలువల్లా ఉన్నారు మీరు. కానీ ఆ కాలువలు ఎండిపోయిన వేళ ప్రవహించవు. వేడిగాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు. కాలువలు ప్రవహించవు. వ్యాపారస్థులు వారి మార్గాలలోని మలుపుల మూలలు తిరిగి ఎడారిలోకి వెళ్లి అక్కడ మరణిస్తారు. తేమా వర్తక బృందాలు నీళ్లకోసం వెదుకుతారు. షేబా ప్రయాణీకులు ఆశగా (నీళ్ల కోసం) చూస్తారు. నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు. కానీ ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందారు. ఇప్పుడు మీరూ ఆ కాలువల్లా ఉన్నారు. మీరు సహాయం చేయరు. మీరు నా కష్టాలు చూచి భయపడుతున్నారు. నాకు ఏమైనా ఇవ్వండి, మీ ఐశ్వర్యంలోనుండి నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్పలేదు. ‘శత్రువు బలంనుండి నన్ను రక్షించండి. మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి’ అని నేను ఎన్నడూ చెప్పలేదు. “కనుక, ఇప్పుడు నాకు నేర్పించండి. నేను నెమ్మదిగా ఉంటాను. నేను ఏమి తప్పు చేశానో నాకు చూపించండి. నిజాయితీ మాటలు శక్తి గలవి. కానీ మీ వాదాలు దేనినీ రుజువు చేయవు. నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా? మరింత నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా? అవును, తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని సంపాదించటం కోసం మీరు జూదమైనా సరే ఆడతారు. మీరు మీ స్నేహితుణ్ణి అమ్ముకొంటారు. కానీ, ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి. నేను మీతో అబద్ధం చెప్పను. కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. అన్యాయంగా ఉండవద్దు. అవును, మళ్లీ ఆలోచించండి. నేను తప్పు ఏమీ చేయలేదు. నేను అబద్ధం చెప్పటం లేదు. నా మాటల్లో చెడు ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.”

షేర్ చేయి
చదువండి యోబు 6

యోబు 6:1-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను– నా దుఃఖము చక్కగా తూచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా? ఎద్దు మేత చూచి రంకెవేయునా? ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డు లోని తెలుపులో రుచికలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొన కుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల? నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా. క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడనివారైరి. మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమై పోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియు లేకుండ అవి యింకిపోవును. సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. –ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా? పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా? నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా. మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు, మీ స్నేహితులమీద బేరము సాగింతురు. దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయములేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?

షేర్ చేయి
చదువండి యోబు 6

యోబు 6:1-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)