యోబు 21:23-25
యోబు 21:23-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనో దుఃఖముగలవాడై మృతినొందును.
యోబు 21:23-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒక వ్యక్తి పూర్ణ శక్తి, సంపూర్ణ భద్రత, అభివృద్ధి, బాగా పోషించబడిన శరీరం, ఎముకల్లో సమృద్ధి మూలిగ కలిగి ఉండి చస్తాడు. మరొకరు ఎన్నడు ఏ మంచిని అనుభవించకుండానే, మనోవేదనతో చనిపోతారు.
యోబు 21:23-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకడు సమస్త సుఖాలు అనుభవించి, మంచి ఆరోగ్యం, నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు. అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి. మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు.
యోబు 21:23-25 పవిత్ర బైబిల్ (TERV)
ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు. అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న జీవితం జీవించాడు. అతని శరీరం బాగా పోషించబడింది, అతని ఎముకలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు. అతడు మంచిది ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు.