యిర్మీయా 9:7-9
యిర్మీయా 9:7-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను? వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది. ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి. ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా? ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు.
యిర్మీయా 9:7-9 పవిత్ర బైబిల్ (TERV)
కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెబుతున్నాడు, “లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను! నాకు వేరే మార్గం లేదు. నా ప్రజలు పాపం చేశారు. యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు. వారి నాలుకలు అబద్ధాలనే మాట్లాడతాయి. ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు. కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు. మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?” “ఆ రకమైన ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు. నేను వారికి తగిన శిక్ష విధించాలి.” ఇది యెహోవా వాక్కు.
యిర్మీయా 9:7-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.
యిర్మీయా 9:7-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను వారిని శుద్ధి చేసి పరీక్షిస్తాను, నా ప్రజల పాపాన్ని బట్టి అంతకన్నా నేనేం చేయగలను? వారి నాలుక మరణకరమైన బాణం; అది మోసపూరితంగా మాట్లాడుతుంది. వారంతా తమ పొరుగువారితో సమాధానంగానే మాట్లాడతారు, కాని తమ హృదయాల్లో వారి కోసం ఉచ్చులు బిగిస్తారు. అందుకు నేను వారిని శిక్షించకూడదా? ఇలాంటి దేశంపై నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.