యిర్మీయా 32:36-41

యిర్మీయా 32:36-41 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“మీరు ఈ పట్టణం గురించి, ‘ఖడ్గం, కరువు తెగులు కారణంగా అది బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది’ అని అంటున్నారు; అయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను. వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. నేను వారికి ఏక హృదయాన్ని ఒకే మార్గాన్ని ఇస్తాను, తద్వార వారు ఎల్లప్పుడూ నాకు భయపడతారు, వారికి, వారి తర్వాత వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు అంతా మేలు జరుగుతుంది. నేను వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను: నేను వారికి మేలు చేయడం ఎప్పటికీ మానను, వారు నా నుండి ఎన్నటికీ దూరంగా ఉండకుండ నా పట్ల వారికి భయభక్తులు కలిగిస్తాను. నేను వారికి మేలు చేయడంలో నాకు ఆనందం ఉంది కాబట్టి నిజంగా నా పూర్ణహృదయంతో నా పూర్ణాత్మతో వారిని ఈ దేశంలో నాటుతాను.

షేర్ చేయి
Read యిర్మీయా 32

యిర్మీయా 32:36-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు దేవుణ్ణి, యెహోవాను అయిన నేను, ఈ పట్టణం గురించి ఈ మాట చెబుతున్నాను. అది ఖడ్గంతో, కరువుతో, తెగులుతో బాధ పొందింది. దాన్ని బబులోను రాజు చేతికి అప్పగించడం జరిగింది. మీరు ఈ పట్టణం గురించి ఇలా అంటున్నారు, చూడు, నాకు కలిగిన కోపోద్రేకాలతో, మహా ఉగ్రతతో నేను వాళ్ళను వెళ్లగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వాళ్ళను సమకూర్చి ఈ స్థలానికి మళ్ళీ తీసుకు రాబోతున్నాను. వాళ్ళు ఇక్కడ క్షేమంతో నివాసం ఉండేలా చేస్తాను. వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను. వాళ్ళకూ, వాళ్ళ కొడుకులకూ మేలు కలగడానికి, వాళ్ళు నిత్యం నాకు భయపడేలా నేను వాళ్లకు ఒకే హృదయం, ఒకే మార్గం ఇస్తాను నేను వాళ్ళ నుంచి తిరిగిపోకుండా ఉండేలా వాళ్లతో ఒక నిత్యమైన నిబంధన స్థిరం చేస్తాను. వాళ్లకు మేలు చేసేందుకు, వాళ్ళు నన్ను వెంబడించడం విడిచిపెట్టకుండా ఉండేలా వాళ్ళ హృదయాల్లో నా పట్ల గౌరవం కలిగిస్తాను. వాళ్లకు మంచి చెయ్యడంలో ఆనందిస్తాను. నా నిండు హృదయంతో, నా ఉనికి అంతటితో కచ్చితంగా ఈ దేశంలో వాళ్ళను నాటుతాను.”

షేర్ చేయి
Read యిర్మీయా 32

యిర్మీయా 32:36-41 పవిత్ర బైబిల్ (TERV)

“మీ ప్రజలిలా అంటున్నారు, ‘బబులోను రాజు యెరూషలేమును పట్టుకుంటాడు. అతడు కత్తిని వినియోగిస్తాడు. కరువు, రోగాలు ఆవరిస్తాయి. ఈ నగరాన్ని ఓడించటానికి అతనికి అవి తోడ్పడుతాయి.’ కాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి పట్ల మిక్కిలి కోపగించియున్నాను. కాని వారందరిని నేను మరల ఈ ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొనివస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను. ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను. వాస్తవంగా వారంతా ఒకే ప్రజగా జీవించాలనే ఆకాంక్ష నేను వారికి కలిగిస్తాను. వారంతా తమ జీవితాంతం నిజంగా నన్నే ఆరాధించాలనే ధ్యేయ్యం కలిగివుంటారు. నన్ను ఆరాధించి, గౌరవించటం వారికిని, వారి పిల్లలకు మంచిని చేస్తుంది. “‘ఇశ్రాయేలు, యూదా ప్రజలతో నేనొక ఒడంబడిక కుదుర్చుకుంటాను. ఈ నిబంధన శాశ్వతంగా ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం నేనెప్పుడూ వారికి దూరం కాను. నేను వారికెప్పుడు సుముఖంగా ఉంటాను. వారు నన్ను గౌరవించాలనే కోరికతో ఉండేలా చేస్తాను. వారిక ఎన్నడూ నాకు విముఖులు కారు. వారు నన్ను సంతోష పర్చుతారు. వారికి మేలు చేయటానికి నేనెంతో ఉత్సాహం చూపిస్తాను. వారిని ఖచ్చితంగా ఈ దేశంలో నాటి వారు బాగా ఎదిగేలా తోడ్పడతాను. ఇది నా పూర్ణ హృదయంతోను, ఆత్మ సాక్షిగాను చేస్తాను.’”

షేర్ చేయి
Read యిర్మీయా 32

యిర్మీయా 32:36-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు–అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోనురాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమునుగూర్చి చెప్పుచున్నారు గదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏకమార్గమును దయచేయుదును. నేను వారికి మేలుచేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.

షేర్ చేయి
Read యిర్మీయా 32