యిర్మీయా 31:3-6

యిర్మీయా 31:3-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను. నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను, ఇశ్రాయేలు కన్యా, నీవు తిరిగి కట్టబడతావు. మళ్ళీ నీవు నీ తంబురలు తీసుకుని ఆనందించే వారితో కలిసి నాట్యం చేస్తావు. మళ్ళీ సమరయ కొండలపై నీవు ద్రాక్షతోటలు నాటుతావు. రైతులు వాటిని నాటుతారు నీవు వాటి ఫలాలను తింటూ ఆనందిస్తావు. ఎఫ్రాయిం కొండలమీద కావలివారు, ‘రండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.”

యిర్మీయా 31:3-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ‘ఇశ్రాయేలూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. కాబట్టి, నిబంధనా నమ్మకత్వంతో నేను నిన్ను ఆకర్షించుకున్నాను. ఇశ్రాయేలు కన్యా, నువ్వు నిర్మాణం అయ్యేలా నేను నిన్ను మళ్ళీ కడతాను. నువ్వు మళ్ళీ తంబురలు వాయిస్తావు. సంతోష నాట్యాలతో బయటకు వెళ్తావు. నువ్వు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులు మళ్ళీ నాటుతావు. రైతులు వ్యవసాయం చేసి వాటి ఫలాలు అనుభవిస్తారు. ఎఫ్రాయిము పర్వతాల మీద కాపలావాళ్ళు మన దేవుడైన యెహోవా దగ్గరికి, సీయోనుకు ఎక్కి వెళ్దాం రండి’ అని ప్రకటించే రోజు ఒకటి రాబోతుంది.”

యిర్మీయా 31:3-6 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా తన ప్రజలకు దూరము నుండి దర్శనమిస్తాడు. ఆయన ఇలా అన్నాడు: “ప్రజలారా మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అందుకే నా కృప శాశ్వతంగా మీ పట్ల చూపిస్తూవచ్చాను. నేను మీ పట్ల సదా సత్యంగా ఉంటాను. ఓ నా ఇశ్రాయేలు కన్యకా, నిన్ను నేను పునర్నిర్మిస్తాను. నీవు మరల ఒక దేశంలా అవుతావు. నీవు మరలా తంబుర మీటుతావు. వేడుక చేసికొనే ప్రజలందరితో కలిసి నీవు నాట్యం చేస్తావు. ఇశ్రాయేలు రైతులారా, మీరు మళ్లీ పంటలు పండిస్తూ, ద్రాక్షాతోటలు పెంచుతారు. సమరయనగర పరిసరాల్లో వున్న కొండలనిండా మీరు ద్రాక్ష తోటలు పెంచుతారు. ఆ ద్రాక్షా తోటల ఫల సాయాన్ని రైతులంతా అనుభవిస్తారు. కావలి వారు ఈ వర్తమానాన్ని చాటే సమయం వస్తుంది: ‘రండి మనమంతా సీయోనుకు వెళ్లి మన దేవుడైన యెహోవాను ఆరాధించుదాము!’ కొండల ప్రాంతమైన ఎఫ్రాయిములో కూడ కావలివారు ఆ వర్తమానాన్ని చాటి చెప్పుతారు!”

యిర్మీయా 31:3-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను. నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను, ఇశ్రాయేలు కన్యా, నీవు తిరిగి కట్టబడతావు. మళ్ళీ నీవు నీ తంబురలు తీసుకుని ఆనందించే వారితో కలిసి నాట్యం చేస్తావు. మళ్ళీ సమరయ కొండలపై నీవు ద్రాక్షతోటలు నాటుతావు. రైతులు వాటిని నాటుతారు నీవు వాటి ఫలాలను తింటూ ఆనందిస్తావు. ఎఫ్రాయిం కొండలమీద కావలివారు, ‘రండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.”

యిర్మీయా 31:3-6

యిర్మీయా 31:3-6 TELUBSIయిర్మీయా 31:3-6 TELUBSI