యిర్మీయా 10:12-13

యిర్మీయా 10:11-13 పవిత్ర బైబిల్ (TERV)

“ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము, ‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు. వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’” తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే. దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. తన అవగాహనతో దేవుడు ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు. భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు. ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు. భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు. ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు. ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.