న్యాయాధిపతులు 7:15
న్యాయాధిపతులు 7:15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లి–లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి
న్యాయాధిపతులు 7:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
గిద్యోను ఆ కలను దాని భావాన్ని విని తలవంచి నమస్కరించి ఇశ్రాయేలు దండు దగ్గరకు తిరిగివెళ్లి, “లేవండి, యెహోవా మిద్యానీయుల సైన్యాన్ని మీకు అప్పగించారు” అని చెప్పాడు.
న్యాయాధిపతులు 7:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి “లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు” అని చెప్పి
న్యాయాధిపతులు 7:15 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మనుష్యులు ఆ కలను గూర్చి, దాని భావం గూర్చి చెప్పుకోవటం విన్న తర్వాత గిద్యోను దేవునికి సాష్టాంగ పడ్డాడు. తర్వాత గిద్యోను ఇశ్రాయేలీయుల విడిదికి తిరిగి వెళ్లిపోయాడు. గిద్యోను ప్రజలందరినీ పిలిచి, “లేవండి! మిద్యాను ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు.