యెషయా 65:17-19
యెషయా 65:17-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.
యెషయా 65:17-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“చూడండి, నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తాను. గత విషయాలు గుర్తు చేసుకోబడవు. వాటి గురించి ఎవరూ ఆలోచించరు. అయితే నేను సృష్టించబోయే వాటి గురించి మీరు ఎప్పుడూ సంతోషించి ఆనందించండి. నేను యెరూషలేమును సంతోషకరమైన స్థలంగా ప్రజలను ఆనందంగా చేస్తాను. నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను నా ప్రజల్లో ఆనందిస్తాను; ఏడ్పు రోదన శబ్దం ఇకపై దానిలో వినపడవు.
యెషయా 65:17-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను. గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను. అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను. నేను యెరూషలేము గురించి ఆనందిస్తాను. నా ప్రజలను గురించి ఆనందిస్తాను. ఏడుపు, రోదన దానిలో ఇక వినబడవు.
యెషయా 65:17-19 పవిత్ర బైబిల్ (TERV)
“చూడు, నేను ఒక క్రొత్త ఆకాశాన్ని ఒక క్రొత్త భూమిని చేస్తాను. గత విషయాలను ప్రజలు జ్ఞాపకం చేసుకోరు. ఆ విషయాలు ఏవీ నా ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు. నా ప్రజలు విచారంగా ఉండరు. లేదు, వారు సంతోషంగా ఉండి, శాశ్వతంగా దేవుని స్తుతిస్తారు. నేను చేసే సంగతుల మూలంగా వారు సంతోషంగా ఉంటారు. సంపూర్ణ ఆనందంతో నిండిన ఒక యెరూషలేమును నేను చేస్తాను. మరియు వారిని సంతోషించే ప్రజగా నేను చేస్తాను. “అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతోషిస్తాను. నా ప్రజలను గూర్చి నేను సంతోషిస్తాను. ఆ పట్టణంలో మరల ఎన్నడూ ఏడుపు, దుఃఖం ఉండవు.
యెషయా 65:17-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.
యెషయా 65:17-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)