యెషయా 48:12-13
యెషయా 48:12-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి.
షేర్ చేయి
Read యెషయా 48యెషయా 48:12-13 పవిత్ర బైబిల్ (TERV)
“యాకోబూ, నా మాట విను! ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను. కనుక నా మాట వినండి. నేనే ఆది, నేనే అంతం. నా స్వహస్తాలతో (శక్తితో) నేనే భూమిని చేశాను. ఆకాశాన్ని నా కుడి హస్తం చేసింది. మరియు నేను గనుక వాటిని పిలిస్తే అవి కలిసి నా ఎదుటికి వస్తాయి.
షేర్ చేయి
Read యెషయా 48యెషయా 48:12-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.
షేర్ చేయి
Read యెషయా 48