యెషయా 45:9
యెషయా 45:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమిచేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
షేర్ చేయి
Read యెషయా 45యెషయా 45:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మట్టికుండ పెంకుల్లో ఒక పెంకులాటి ఒకడు తనను చేసిన వానితో వాదిస్తే వాడికి బాధ. బంకమట్టి కుమ్మరితో ‘నువ్వేం చేస్తున్నావ్?’ అనవచ్చా? ‘నువ్వు చేసినపుడు నీకు చేతులు లేవా?’ అనగలదా?
షేర్ చేయి
Read యెషయా 45యెషయా 45:9 పవిత్ర బైబిల్ (TERV)
“ఈ ప్రజలను చూడు! వాళ్లు వారిని సృజించిన వానితో వాదిస్తున్నారు. వాళ్లు నాతో వాదించటం చూడు. వాళ్లు పగిలిపోయిన కుండ పెంకులా ఉన్నారు. ఒకడు కుండ చేయటానికి జిగట మన్ను ఉపయోగిస్తాడు. మరి ఆ మట్టి, ‘ఓ మనిషీ, ఏం చేస్తున్నావు?’ అని అడగదు. తయారు చేయబడిన వస్తువులకు వాటిని తయారుచేసిన వానిని ప్రశ్నించే అధికారం లేదు. మనుష్యులు ఈ మట్టిలాగే ఉన్నారు.
షేర్ చేయి
Read యెషయా 45