యెషయా 1:2-4
యెషయా 1:2-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆకాశాల్లారా, నా మాట వినండి! భూమీ శ్రద్ధగా విను! యెహోవా ఇలా చెప్తున్నారు: “నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కాని వారు నా మీద తిరుగబడ్డారు. ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది, గాడిదకు తన యజమానుని పశువుల దొడ్డి తెలుసు, కాని ఇశ్రాయేలుకు వారి యజమాని ఎవరో తెలియదు, నా ప్రజలు గ్రహించరు.” పాపిష్ఠి దేశానికి శ్రమ, ఆ ప్రజల దోషం గొప్పది, వారిది దుష్ట సంతానం, అవినీతికి అప్పగించబడిన పిల్లలు! వారు యెహోవాను విడిచిపెట్టారు; ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని తృణీకరించారు. వారు ఆయనను విడిచి తొలగిపోయారు.
యెషయా 1:2-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు. “నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దుకు తన యజమాని తెలుసు. తన మేత తొట్టి గాడిదకు తెలుసు. కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.” ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా, దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ. వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు. ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు. ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు.
యెషయా 1:2-4 పవిత్ర బైబిల్ (TERV)
ఆకాశమా, భూమీ, యెహోవా మాట వినండి! యెహోవా ఇలా చెబుతున్నాడు. “నా పిల్లల్ని నేను పెంచాను. నా పిల్లలు పెరగటానికి నేను సహాయం చేసాను. కానీ నా పిల్లలు నా మీద తిరగబడ్డారు. ఎద్దుకు తన కామందు తెలుసు. గాడిదకు దాని సొంతదారుడు మేత పెట్టే చోటు తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు.” ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుణ్ణి) ఆ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు.
యెషయా 1:2-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. –నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితినివారు నామీద తిరుగబడియున్నారు. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ.వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.
యెషయా 1:2-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)