హెబ్రీయులకు 8:8-13
హెబ్రీయులకు 8:8-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పాడు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నాడు, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో మరియు యూదా ప్రజలతో ఒక క్రొత్త నిబంధన చేయడానికి రోజులు సమీపించాయి. ఆ నిబంధన, ఐగుప్తు నుండి నేను వారి పితరుల చెయ్యి పట్టుకొని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు, ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు, అందుకే నేను వారి నుండి దూరమయ్యాను, అని ప్రభువు చెప్తున్నాడు. ఆ సమయం తరువాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగు వారికి బోధించరు, లేదా ‘ప్రభువును తెలుసుకోండి’ అని సహోదరులు ఒకరితో ఒకరు చెప్పరు, ఎందుకంటే వారిలో అల్పులు మొదలుకొని గొప్పవారి వరకు వారందరు నన్ను తెలుసుకొంటారు. నేను వారి దుర్మార్గాలను క్షమిస్తాను వారి పాపాలను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.” ఆయన ఈ నిబంధనను “క్రొత్త నిబంధన” అని పిలవడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి.
హెబ్రీయులకు 8:8-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రజల్లో దోషాలు కనిపించినప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి. ఐగుప్తు దేశం నుండి వారి పూర్వీకులను చెయ్యి పట్టుకుని బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది. ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు. నేనూ ఇక వారిమీద మనసు పెట్టడం మానేశాను.” ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది. వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను. అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను. నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు. ‘ప్రభువును తెలుసుకో’ అంటూ వారిలో ఎవడూ తన ఇరుగు పొరుగు వాళ్లకి గానీ తన సోదరునికి గానీ ఉపదేశం చేయడు. ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుండి గొప్పవాడి వరకూ అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను. వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.” ఆయన ‘కొత్త ఒప్పందం’ అని చెప్పడం వల్ల, మొదటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు. దేన్నైతే ఆయన పాతది అని ప్రకటించాడో అది మాసిపోవడానికి సిద్ధంగా ఉంది.
హెబ్రీయులకు 8:8-13 పవిత్ర బైబిల్ (TERV)
కాని ప్రభువు ప్రజల పొరపాట్లను కనిపెట్టి వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా, ప్రజలతో క్రొత్త ఒడంబడిక చేయవలసిన సమయం వస్తుంది! వాళ్ళ ముత్తాతల్ని ఈజిప్టు దేశంనుండి, చేయి పట్టుకొని వెలుపలికి పిలుచుకొని వచ్చాను. ఆనాడు వాళ్ళతో ఒక ఒడంబడిక చేసాను. నేను మీతో చేయబోతున్న ఒడంబడిక ఆనాటి ఒడంబడికలా ఉండదు. వాళ్ళు నా ఒడంబడిక ప్రకారం నడుచుకోలేదు గనుక వాళ్ళను నేను లెక్క చెయ్యలేదు. ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా ఒడంబడిక చేస్తాను: నా నియమాల్ని వాళ్ళ మనస్సుల్లో ఉంచుతాను. వాటిని వాళ్ళ హృదయాలపై వ్రాస్తాను. నేను వాళ్ళ దేవునిగా ఉంటాను. వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. అప్పుడు ప్రభువుని తెలుసుకోమని ప్రక్కింటివానికి గాని, తన సోదరునికి గాని బోధించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో అధముడు, గొప్పవాడు, అందరు నన్ను తెలుసుకొంటారు. నేను వాళ్ళ దోషాల్ని క్షమిస్తాను. వాళ్ళ పాపాల్ని మరచిపోతాను. ఈ ఒడంబడికను “క్రొత్త ఒడంబడిక” అని పిలవటం వల్ల మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. పురాతనమైనది, శిథిలమైనది, త్వరలోనే అదృశ్యమైపోతుంది.
హెబ్రీయులకు 8:8-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు – ప్రభువు ఇట్లనెను–ఇదిగో యొక కాలమువచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును. అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగా–వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందునువారు నాకు ప్రజలైయుందురు.వారిలో ఎవడును – ప్రభువు ను తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలవరకు అందరును నన్ను తెలిసికొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది.
హెబ్రీయులకు 8:8-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పారు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజులు వస్తున్నాయి, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేస్తాను. ఆ నిబంధన, ఈజిప్టు దేశం నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకొని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు, అందుకే నేను వారి నుండి దూరమయ్యాను, అని ప్రభువు చెప్తున్నారు. ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘ప్రభువును తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు. ఎందుకంటే నేను దయతో వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.” ఆయన ఈ నిబంధనను, “క్రొత్త” అని పిలువడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి.