హెబ్రీయులకు 2:5-8

హెబ్రీయులకు 2:5-8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ రాబోవు లోకాన్ని ఆయన దేవదూతల చేతి క్రింద ఉంచలేదు. అయితే ఒకచోట ఒకరు ఇలా సాక్ష్యమిచ్చారు: “నీవు జ్ఞాపకం చేసుకోవడానికి మానవాళి ఏపాటిది, నీవు మనుష్యుని లక్ష్యపెట్టడానికి అతడు ఏపాటివాడు? నీవు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసావు; నీవు వారికి మహిమ ఘనతలతో కిరీటాన్ని ధరింపచేసావు ప్రతిదీ వారి పాదాల క్రింద ఉంచావు,” ప్రతి దాన్ని వారి క్రింద ఉంచుతూ, వారికి లోబరచకుండా దేవుడు దేనిని విడిచిపెట్టలేదు. అయినాసరే వారికి ప్రతిది లోబడడం ప్రస్తుతానికి మనమింకా చూడలేదు.

హెబ్రీయులకు 2:5-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు. దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు? నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు. నువ్వు సమస్తాన్నీ అతనికి లోబరచి అతని పాదాల కింద ఉంచావు.” ఆయన సమస్తాన్నీ మానవాళి వశం చేశాడు. అతనికి వశం చేయకుండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ పూర్తిగా అతనికి వశం కావడం మనం ఇంకా చూడలేదు.

హెబ్రీయులకు 2:5-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు –నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడ లేదుగాని

హెబ్రీయులకు 2:5-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ రాబోవు లోకాన్ని ఆయన దేవదూతల చేతి క్రింద ఉంచలేదు. అయితే ఒకచోట ఒకరు ఇలా సాక్ష్యమిచ్చారు: “మీరు మానవాళిని లక్ష్యపెట్టడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు? మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు; మీరు మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు. సమస్తాన్ని వారి పాదాల క్రింద ఉంచారు,” సమస్తాన్ని వారి క్రింద ఉంచుతూ, వారికి లోబరచకుండా దేవుడు దేన్ని విడిచిపెట్టలేదు. అయినాసరే వారికి ప్రతిదీ లోబడడం ప్రస్తుతానికి మనమింకా చూడలేదు.