హెబ్రీయులకు 12:15-17
హెబ్రీయులకు 12:15-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుని కృపను పొందడంలో ఎవరు తప్పిపోకుండా, చేదైన వేరు మొలిచి మిమ్మల్ని కలవరపరచి అనేకమందిని అపవిత్రులుగా చేయకుండా జాగ్రత్తపడండి. ఎవరు లైంగిక అనైతికంగా, దైవభక్తి లేని ఏశావులా ఉండకుండా చూసుకోండి, అతడు ఒక్కపూట తిండి కొరకు జ్యేష్ఠ కుమారునిగా తనకున్న వారసత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఆ తరువాత ఏశావు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని అనుకున్నప్పుడు అతడు పొందలేక పోయాడని మీకు తెలుసు. ఎందుకంటే అతడు పశ్చాత్తాపపడేప్పటికి చాలా ఆలస్యమైంది. అతడు కన్నీటితో వెదకినా, తాను చేసిన దాన్ని మార్చలేకపోయాడు.
హెబ్రీయులకు 12:15-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి. లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి. ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.
హెబ్రీయులకు 12:15-17 పవిత్ర బైబిల్ (TERV)
ఒక్కరు కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్తపడండి. వ్యభిచారం చెయ్యకండి. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన ఏశావువలె భక్తిహీనులై జీవించకండి. ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాకరించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. కాని లాభం కలుగలేదు.
హెబ్రీయులకు 12:15-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అప విత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.
హెబ్రీయులకు 12:15-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దేవుని కృపను పొందడంలో ఎవరు తప్పిపోకుండా, చేదైన వేరు మొలిచి మిమ్మల్ని కలవరపరచి అనేకమందిని అపవిత్రులుగా చేయకుండా జాగ్రత్తపడండి. లైంగిక అనైతికతను సాగించేవారు గాని ఒక్కపూట తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావులాంటి దైవభక్తిలేని వారు గాని మీలో లేకుండ జాగ్రత్తపడండి. ఆ తర్వాత ఏశావు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని అనుకున్నప్పుడు అతడు పొందలేక పోయాడని మీకు తెలుసు. ఎందుకంటే అతడు పశ్చాత్తాపపడేప్పటికి చాలా ఆలస్యమైంది. అతడు కన్నీటితో వెదకినా, తాను చేసిన దాన్ని మార్చలేకపోయాడు.