హబక్కూకు 1:12-17

హబక్కూకు 1:12-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలికలేని చేపలతోను ప్రాకుపురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి. వాడు గాలమువేసి మానవులనందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు. కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయుచుండవలెనా?

షేర్ చేయి
Read హబక్కూకు 1

హబక్కూకు 1:12-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా? మేము మరణించము. యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా. కపటులను నువ్వు చూసి కూడా, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు? పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు. వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు. ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు. వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు. కాబట్టి వలల వలన మంచి రాబడి, పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు. తన వలలకు సాంబ్రాణి వేస్తున్నాడు. వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా?”

షేర్ చేయి
Read హబక్కూకు 1

హబక్కూకు 1:12-17 పవిత్ర బైబిల్ (TERV)

పిమ్మట హబక్కూకు చెప్పాడు: “యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే దేవుడవు! నీవు చావులేని పవిత్ర దేవుడవు! యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటానికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు. మా ఆశ్రయ దుర్గమా, యూదా ప్రజలను శిక్షించటానికి నీవు వారిని సృష్టించావు. నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు. ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు. మరి అటువంటి నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలుగుతున్నావు? దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు? “నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయారు చేశావు. నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు. వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టుకుంటాడు. శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు, తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు. శత్రువు తను భాగ్యవంతుడుగా నివసించటానికి, మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి సహాయపడుతుంది. కావున శత్రువు తన వలను ఆరాధిస్తాడు. తన వల యొక్క గౌరవార్థం అతడు దానికి బలులు అర్పించి, ధూపంవేస్తాడు. తన వలతో ధనాన్ని తీసుకుపోవటం అతడు కొనసాగిస్తాడా? దయా దాక్షిణ్యం లేకుండా అతడు (బబులోను సైన్యం) ప్రజలను నాశనం చేయటం కొనసాగిస్తాడా?”

షేర్ చేయి
Read హబక్కూకు 1

హబక్కూకు 1:12-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా? నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు. యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు; నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు. నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి; నీవు తప్పును సహించలేవు. మరి ద్రోహులను ఎందుకు సహిస్తున్నావు? దుర్మార్గులు తమకంటే నీతిమంతులైన వారిని నాశనం చేస్తుంటే నీవెందుకు మౌనంగా ఉన్నావు? పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు. చెడ్డ శత్రువు వారందరిని గాలంతో పైకి లాగి, తన వలలో వారిని పట్టుకుంటాడు, తన ఉచ్చులో వారిని పోగుచేసుకుని సంతోషంతో గంతులు వేస్తాడు. తన వల వలన విలాసవంతమైన జీవితం మంచి ఆహారం దొరుకుతుందని తన వలకు బలులు అర్పించి తన ఉచ్చుకు ధూపం వేస్తాడు. అతడు కనికరం లేకుండా దేశాలను నాశనం చేస్తూ, నిత్యం తన వలను ఖాళీ చేస్తూనే ఉంటాడా?

షేర్ చేయి
Read హబక్కూకు 1