ఆదికాండము 4:25-26
ఆదికాండము 4:25-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది. షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను ఆరాధించడం ఆరంభించారు.
ఆదికాండము 4:25-26 పవిత్ర బైబిల్ (TERV)
ఆదాము హవ్వతో కలిసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కయీను హేబెలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ. షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషు అని అతడు పేరు పెట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.
ఆదికాండము 4:25-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని–కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
ఆదికాండము 4:25-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆదాము తన భార్యను మరోసారి లైంగికంగా కలుసుకున్నప్పుడు, ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చి, “దేవుడు, కయీను చంపిన నా కుమారుడు హేబెలుకు బదులుగా మరొక శిశువునిచ్చారు” అని అతనికి షేతు అని పేరు పెట్టింది. షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అని పేరు పెట్టాడు. అప్పటినుండి ప్రజలు యెహోవా నామంలో ప్రార్థించడం మొదలుపెట్టారు.