ఆదికాండము 36:1-19

ఆదికాండము 36:1-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి: కనాను స్త్రీలలో నుండి ఏశావు తన భార్యలుగా చేసుకున్న వారు: హిత్తీయుడైన ఎలోను కుమార్తెయైన ఆదా, హివ్వీయుడైన సిబ్యోను మనవరాలు, అనా కుమార్తెయైన ఒహోలీబామా, అలాగే నెబాయోతు సోదరి, ఇష్మాయేలు కుమార్తెయైన బాశెమతు. ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. ఒహోలీబామా యూషు, యాలాము, కోరహులను కన్నది. వీరంత కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు. ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు. వారి ఆస్తులు వారు కలిసి ఉండలేనంత గొప్పగా ఉన్నాయి; వారికున్న పశువులను బట్టి వారున్న స్థలం వారికి సరిపోలేదు. కాబట్టి ఏశావు అనగా ఎదోము శేయీరు కొండ సీమలో స్థిరపడ్డాడు. శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి: ఏశావు కుమారులు: ఏశావు భార్య ఆదా కుమారుడైన ఎలీఫజు, ఏశావు భార్య బాశెమతు కుమారుడైన రెయూయేలు. ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు. ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు. రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు. ఏశావు భార్య అనా కుమార్తెయైన సిబ్యోను మనవరాలైన ఒహోలీబామా ద్వారా కలిగిన ఏశావు కుమారులు: యూషు, యాలాము, కోరహు. ఏశావు వారసులలో నాయకులైన వారు వీరు: ఏశావు మొదటి కుమారుడైన ఎలీఫజు కుమారులు: నాయకులైన తేమాను, సెఫో, కనజు, ఓమారు, కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోములో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు. ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు: నాయకులైన నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఎదోములో రెయూయేలు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు. ఏశావు భార్య ఒహోలీబామా యొక్క కుమారులు: నాయకులైన యూషు, యాలాము, కోరహు. వీరు అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామా నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు.

షేర్ చేయి
Read ఆదికాండము 36

ఆదికాండము 36:1-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది. ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా, ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు. ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు. అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు. ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు. వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు. కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము. శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది. ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు. ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా. ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు. రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు. ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహొలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు. ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు, కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు. ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు. ఇక ఏశావు భార్య, అనా కూతురు అయిన అహొలీబామా కొడుకులు యూషు, యగ్లాము, కోరహు. వీరు అహొలీబామా పుత్రసంతానపు నాయకులు. వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు.

షేర్ చేయి
Read ఆదికాండము 36

ఆదికాండము 36:1-19 పవిత్ర బైబిల్ (TERV)

ఏశావు (ఎదోము అని కూడ అతనికి పేరు) కుటుంబ జాబితా ఇది: ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. ఏశావు భార్యలు ఎవరంటే: హిత్తీవాడైన ఏలోను కుమార్తె ఆదా, హివ్వీవాడైన సిబ్యోను కుమారుడు అనా కుమార్తె అహోలీబామా, ఇశ్మాయేలు కుమార్తెయు నెబాయోతు సోదరియైన బాశెమతు. ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది. అహోలీబామా ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు కనాను దేశంలో పుట్టారు. ఏశావు కుటుంబం, యాకోబు కుటుంబం కలిసి ఒకే చోట నివసించటం వల్ల ఆ ప్రాంతం వాళ్ల పోషణకు చాలలేదు. కనుక ఏశావు కనాను విడిచిపెట్టి తన సోదరుడు యాకోబుకు దూరంగా మరో దేశం వెళ్లిపోయాడు. ఏశావు తనకు కలిగినదంతా తనతోబాటు తీసుకొని పోయాడు. ఇవన్నీ అతడు కనానులో నివసించినప్పుడు సంపాదించుకొన్నాడు. కనుక తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన బానిసలందరిని, పశువులను, ఇతర జంతువులను ఏశావు తనతో కూడ తెచ్చుకొన్నాడు. కనుక ఏశావు శేయీరు కొండ ప్రాంతానికి తరలి పోయాడు. (ఏశావుకు ఎదోము అని కూడ పేరు. మరియు ఎదోము, శేయీరు దేశానికి మరో పేరు.) ఎదోము ప్రజలకు ఏశావు తండ్రి. శేయీరు (ఎదోము) కొండ ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు కుటుంబంలోని వాళ్ల పేర్లు యివి: ఏశావు కుమారులు: ఏశావు, ఆదాలకు పుట్టిన కుమారుడు ఎలీఫజు. ఏశావు, బాశెమతులకు పుట్టిన కుమారుడు రగుయేలు. ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, ఓమారు, సెపో, గాతాము మరియు కనజు. ఎలీఫజుకు తిమ్నా అనే ఒక దాసి కూడ ఉంది. తిమ్నా, ఎలీఫజులకు అమాలేకు పుట్టాడు. రగూయేలుకు ముగ్గురు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు బాశెమతు మూలంగా ఏశావుకు మనుమళ్లు. అనా (సిబ్యోను కుమారుడు) కుమార్తె అహోలీబామా ఏశావుకు మూడవ భార్య. ఏశావు, అహోలీబామాలకు పుట్టిన పిల్లలు: యూషు, యాలాము, కోరహు. ఏశావు ద్వారా వచ్చిన వంశాలు యివి: ఏశావు మొదటి కుమారుడు ఎలీఫజు. ఎలీఫజుకు పుట్టిన వారు: తేమాను, ఓమారు, సెపో, కనజు. కోరహు, గాతాము, అమాలేకు. ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భవించాయి ఏశావు కుమారుడు రగూయేలు ఈ క్రింది కుటుంబాలకు తండ్రి: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. ఈ కుటుంబాలన్నీ ఏశావు భార్య బాశెమతు నుండి ఉద్భవించాయి. అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామాకు యూషు, యగ్లాము, కోరహు పుట్టారు. ఈ ముగ్గురు వారికి పుట్టిన కుటుంబాలకు పెద్దలు. ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి.

షేర్ చేయి
Read ఆదికాండము 36

ఆదికాండము 36:1-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఎదోమను ఏశావు వంశావళి ఇదే, ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాశెమతును పెండ్లియాడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను; వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందునవారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే, ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు. వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యాలాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.

షేర్ చేయి
Read ఆదికాండము 36

ఆదికాండము 36:1-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)