ఆదికాండము 35:23-29
ఆదికాండము 35:23-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.
ఆదికాండము 35:23-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు. యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు. రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను. ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.
ఆదికాండము 35:23-29 పవిత్ర బైబిల్ (TERV)
అతని భార్య లేయా మూలంగా అతనికి ఆరుగురు కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలును. అతని భార్య రాహేలు మూలంగా అతనికి ఇద్దరు కుమారులున్నారు. యోసేపు, బెన్యామీను. రాహేలు పనిమనిషి బిల్హా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాను, నఫ్తాలి. లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు. కిర్యతర్బాలోని (హెబ్రోను) మమ్రేలోనున్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది. ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. ఇస్సాకు చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చనిపోయినప్పుడు వృద్ధుడు. అతని తండ్రి సమాధి చేయబడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతణ్ణి కూడ సమాధి చేశారు.
ఆదికాండము 35:23-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
లేయా కుమారులు: యాకోబు మొదటి కుమారుడు రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. రాహేలు కుమారులు: యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి బిల్హా కుమారులు: దాను, నఫ్తాలి. లేయా దాసి జిల్పా కుమారులు: గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో జన్మించిన యాకోబు కుమారులు. యాకోబు కిర్యత్-అర్బా (అంటే, హెబ్రోను) దగ్గర ఉన్న మమ్రేలో తన తండ్రి దగ్గరకు వచ్చాడు, అబ్రాహాము, ఇస్సాకు అక్కడే నివసించారు. ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు. అతడు తన తుది శ్వాస విడిచి, చనిపోయి మంచి వృద్ధాప్యంలో తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. అతని కుమారులు, ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు.