ఆదికాండము 3:4-6
ఆదికాండము 3:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పాము స్త్రీతో “మీరు చావనే చావరు. ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
ఆదికాండము 3:4-6 పవిత్ర బైబిల్ (TERV)
అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావరు. ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!” ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్లు ఆ స్త్రీ చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్లు, ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు.
ఆదికాండము 3:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు సర్పము–మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొనితిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను
ఆదికాండము 3:4-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు సర్పం, “మీరు ఖచ్చితంగా చావరు. మీరు అది తింటే మీ కళ్లు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచిచెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు” అని చెప్పింది. స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు.