ఆదికాండము 24:39-40
ఆదికాండము 24:39-40 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“అందుకు నేను, ‘ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఎలా?’ అని నా యజమానిని అడిగాను. “అందుకతడు జవాబిస్తూ, ‘నేను ఇంతవరకు ఎవరి ఎదుట నమ్మకంగా జీవించానో, ఆ యెహోవా తన దూతను నీకు ముందుగా పంపి నీ ప్రయాణం విజయవంతం చేస్తారు, కాబట్టి నీవు నా సొంత వంశస్థులలో నుండి నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని కోసం భార్యను తీసుకువస్తావు.
ఆదికాండము 24:39-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దానికి నేను ‘ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే?’ అని నా యజమానిని అడిగాను. అతడు ‘నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను. ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి నా తండ్రి వారసులనుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకు వస్తావు.
ఆదికాండము 24:39-40 పవిత్ర బైబిల్ (TERV)
‘ఒక వేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశానికి రాదేమో’ అని నేను నా యజమానితో అన్నాను. అయితే నా యజమాని నాతో ఇలా చెప్పాడు, ‘నేను యెహోవాను సేవిస్తాను, యెహోవా తన దూతను నీతో కూడ పంపి నీకు సహాయం చేస్తాడు. అక్కడి ప్రజలలో నా కుమారుని కోసం భార్యను నీవు కనుక్కొంటావు.
ఆదికాండము 24:39-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు నేను నా యజమానునితో –ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు అతడు –ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతోకూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు
ఆదికాండము 24:39-40 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)