ఆదికాండము 21:8-34

ఆదికాండము 21:8-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి –ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు–ఈ చిన్నవానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజముమీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి–హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు; నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతపట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్ద వాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి–నీవుచేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రాహాము–ప్రమాణము చేసెదననెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు–ఈ పని యెవరు చేసిరో నేనెరుగను; నీవును నాతో చెప్పలేదు; నేను నేడేగాని యీ సంగతి విన లేదని చెప్పగా అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి. తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలోనుండి యేడు పెంటిపిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రాహాముతో–నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు –నేనే యీ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱెపిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

షేర్ చేయి
Read ఆదికాండము 21

ఆదికాండము 21:8-34 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇస్సాకు పాలు విడిచిన రోజు అబ్రాహాము పెద్ద విందు చేశాడు. అయితే ఈజిప్టు దాసి హాగరు ద్వార అబ్రాహాముకు పుట్టిన కుమారుడు శారాను హేళన చేయడం చూసి, ఆమె అబ్రాహాముతో, “ఆ దాసిని దాని కుమారున్ని పంపివేయండి, దాని కుమారుడు ఎప్పటికీ నా కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని శారా చెప్పింది. తన కుమారునికి సంబంధించిన విషయం కాబట్టి అబ్రాహాము చాలా బాధపడ్డాడు. అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది. అయితే దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా గొప్ప జనంగా చేస్తాను.” మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది. తిత్తిలో నీళ్లు అయిపోయినప్పుడు ఆమె ఆ పిల్లవాన్ని ఒక పొద క్రింద ఉంచింది. తర్వాత ఆమె కొంత దూరం వెళ్లి కూర్చుంది, ఎందుకంటే, “బాలుడు చావడం నేను చూడలేను” అని అనుకుంది. అక్కడ కూర్చుని అదుపు లేకుండ ఏడవసాగింది. దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు. ఆ పిల్లవాన్ని లేపి నీ చేతితో పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను” అని అన్నాడు. అప్పుడు దేవుడు ఆమె కళ్లు తెరిచారు, ఆమె నీళ్ల ఊటను చూసింది. ఆమె వెళ్లి తిత్తిని నీళ్లతో నింపి బాలునికి త్రాగడానికి ఇచ్చింది. ఆ పిల్లవాడు ఎదుగుతుండగా దేవుడు అతనితో ఉన్నారు. అతడు ఎడారిలో నివసిస్తూ విలుకాడయ్యాడు. అతడు పారాను ఎడారిలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది. ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు. కాబట్టి నీవు నాతో గాని నా పిల్లలతో గాని నా వారసులతో గాని మోసపూరితంగా వ్యవహరించవని దేవుని ఎదుట నాతో ప్రమాణం చేయి. నీవు పరదేశిగా ఉంటున్న ఈ దేశంలో నేను చూపించిన దయ నాకు, ఈ దేశానికి చూపించు.” అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నా” అన్నాడు. అప్పుడు అబీమెలెకు దాసులు అంతకుముందు ఒక బావిని ఆక్రమించుకున్న విషయాన్ని అబ్రాహాము అబీమెలెకుకు చెప్పాడు. అయితే అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. నీవు నాకు చెప్పలేదు, ఈ రోజే ఈ సంగతి వింటున్నాను” అని అన్నాడు. అబ్రాహాము గొర్రెలు పశువులు తీసుకువచ్చి అబీమెలెకుకు ఇచ్చాడు, ఆ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు. అబ్రాహాము తన మంద నుండి ఏడు ఆడ గొర్రెపిల్లలను వేరు చేశాడు. అబీమెలెకు, “నీవు స్వయంగా వేరు చేసిన ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలకు అర్థం ఏంటి?” అని అబ్రాహామును అడిగాడు. అందుకు అతడు, “నేను ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలను నా చేతి నుండి అంగీకరించు” అని చెప్పాడు. అక్కడ వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షేబ అని పేరు పెట్టారు. బెయేర్షేబ దగ్గర ఒప్పందం చేసుకున్న తర్వాత అబీమెలెకు, సేనాధిపతియైన ఫీకోలు ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు. అబ్రాహాము బెయేర్షేబలో ఒక పిచుల వృక్షం నాటాడు, అక్కడ నిత్య దేవుడైన యెహోవా నామాన్ని ఆరాధించాడు. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 21

ఆదికాండము 21:8-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది. ఆమె అబ్రాహాముతో ఇలా అంది. “ఈ దాసీనీ ఈమె కొడుకునీ వెళ్ళగొట్టు. ఎందుకంటే ఈ దాసీ కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీలులేదు.” ఈ మాట విన్న అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేలుని బట్టి చాలా వేదన చెందాడు. అయితే దేవుడు “ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు. అయినప్పటికీ ఈ దాసీ కొడుకు కూడా నీ సంతానం గనక నేను అతణ్ణి కూడా ఒక జాతిగా చేస్తాను” అని అబ్రాహాముతో చెప్పాడు. కనుక అబ్రాహాము తెల్లవారకముందే లేచి రొట్టె, నీళ్ళు పోసిన తోలు తిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అడవికి చేరి అక్కడ తిరుగుతూ ఉంది. ఆ తోలు తిత్తిలోని నీళ్ళు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది. “ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు” అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది. అక్కడ ఎలుగెత్తి బిగ్గరగా ఏడ్చింది. దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. “హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు. నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను” అని ఆమెకు చెప్పాడు. అప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుచుకోనేలా చేశాడు. ఆమె ఎదురుగా ఉన్న ఒక నీళ్ళ ఊటను చూసింది. ఆమె వెళ్ళి తోలు తిత్తిని నీళ్ళతో నింపి ఆ బాలుడికి తాగించింది. దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు. అతడు పారాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెళ్ళి చేసింది. ఆ రోజుల్లో అబీమెలెకూ, అతని సైన్యాధిపతి ఫీకోలూ కలసి వచ్చి అబ్రాహాముతో మాట్లాడారు. “నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు నన్ను, నా కొడుకుని, నా మనుమళ్ళను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి. నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్లా, నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్లా చూపించు” అన్నాడు. అందుకు అబ్రాహాము “నేను వాగ్దానం చేస్తాను” అన్నాడు. అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు “ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు. నువ్వు కూడా దీని విషయం నాకేమీ చెప్పలేదు. నాకీ సంగతి ఈ రోజే తెలిసింది” అన్నాడు. అబ్రాహాము గొర్రెలనూ ఎడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు. తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుంచి ఏడు ఆడ గొర్రెలను తీసి వేరుగా ఉంచాడు. అది చూసి అబీమెలెకు అబ్రాహాముతో “నువ్వు ఏడు ఆడ గొర్రెలను వేరుగా తీసి ఉంచావు. దాని అంతరార్ధం ఏమిటి?” అని అడిగాడు. దానికి అబ్రాహాము “ఈ బావిని నేనే తవ్వించాననడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెలను నువ్వు తీసుకోవాలి” అన్నాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి “బెయేర్షెబా” అనే పేరు వచ్చింది. బెయేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సైన్యాధిపతి ఫీకోలుతో కలసి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్ళాడు. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు. అక్కడ శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 21

ఆదికాండము 21:8-34 పవిత్ర బైబిల్ (TERV)

ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేశాడు. గతంలో ఈజిప్టు బానిస స్త్రీయైన హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా అబ్రాహామే తండ్రి. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది. కనుక “ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు” అంటూ శారా అబ్రాహాముతో చెప్పింది. ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు. కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు. అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడూ నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.” మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లను తెచ్చాడు. అబ్రాహాము వాటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వాటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది. కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. త్రాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది. హాగరు కొంచెం దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తుంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది. ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు. వెళ్లి, పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి నేను అతణ్ణి తండ్రిగా చేస్తాను.” అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్లు చేశాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి, తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు త్రాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది. ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేటగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు. అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు. అంతట అబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫీకోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తానని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.” “నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కూడా నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము. అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేశాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచినీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేశాడు. కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు. కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడికకు సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబ్రాహాము అబీమెలెకుకు ఇచ్చాడు. ఏడు ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబ్రాహాము అబీమెలెకు ఎదుట ఉంచాడు. “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు. “ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్లు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు. కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు. కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబీమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు. బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు నాటాడు. అప్పుడు అబ్రాహాము, ప్రభువును, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడునైన యెహోవాకు అక్కడ ప్రార్థన చేశాడు. ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 21

ఆదికాండము 21:8-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి –ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు–ఈ చిన్నవానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజముమీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి–హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు; నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతపట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్ద వాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి–నీవుచేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రాహాము–ప్రమాణము చేసెదననెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు–ఈ పని యెవరు చేసిరో నేనెరుగను; నీవును నాతో చెప్పలేదు; నేను నేడేగాని యీ సంగతి విన లేదని చెప్పగా అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి. తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలోనుండి యేడు పెంటిపిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రాహాముతో–నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు –నేనే యీ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱెపిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

షేర్ చేయి
Read ఆదికాండము 21

ఆదికాండము 21:8-34 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)